చంద్రబాబు, నరేంద్రమోడీ.. ఇద్దరూ ఇ.సి.కి దొరికారు

 

ఇద్దరు మిత్రులు తెలుగుదేశం అధినేత, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇద్దరూ ఎన్నికల కమిషన్‌కి దొరికిపోయారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఓటు వేశాక మీడియాతో మాట్లాడుతూ, పొత్తు ధర్మం ప్రకారం తాను బీజేపీకి ఓటు వేశానని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ ఓటు ఎవరికి వేసింది బయటకి చెప్పకూడదు. దాంతో చంద్రాబాబు ఓటు చెల్లదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ప్రకటించారు. అలాగే అహ్మదాబాద్‌లో నరేంద్రమోడీ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడే సందర్భంలో తన చేత్తో కమలం గుర్తును పట్టుకుని మీడియాకి చూపించారు. ఈ దృశ్యాలు దేశవ్యాప్తంగా టీవీ ఛానెళ్ళలో ప్రదర్శితమయ్యాయి. ఇలా బీజేపీ గుర్తును చూపించడం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఫిర్యాదు అందుకున్న ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని పరిశీలించి నరేంద్ర మోడీ మీద కేసు నమోదు చేసింది. ఇలా ఇద్దరు మిత్రులూ ఒకేసారి ఇ.సి.కి దొరికిపోయారు.