TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామచంద్రాపురంలో దేశం అభ్యర్థికోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు

Published on: Thu Mar 29, 2012 11:48AM

తూర్పుగోదావరిజిల్లా రామచంద్రాపురం ఉప ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ఒకవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పిల్లి సుబాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ అభ్యర్ధి తోట త్రిమూర్తులు మందీ మార్బలంతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తమ అభ్యర్ధి ఎవరో తెలియక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దిగాలు పడుతున్నారు. టిడిపి తరపున తొలుత రాష్ట్ర మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావును బరిలోకి దింపాలని భావించారు. అయితే ఇక్కడ బలహీన వర్గాల నుంచి వచ్చే అభ్యర్ధిని నిలబెడితే గట్టి పోటీని ఇవ్వగలుగుతారని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే కట్టా సూర్యనారాయణ పేరు ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్ధిని ఏప్రిల్ 1వ తేదీన ఖరారు చేసే అవకాశం ఉంది.