ఈక్వెడార్‌లో మళ్లీ భూకంపం..వణుకుతున్న ప్రజలు
Published on: Fri Apr 22, 2016 11:09AM

వరుస భూకంపాలతో చిగురుటాకులా వణుకుతున్న ఈక్వెడార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. దీంతో ప్రజలు ఇళ్లలోంచి రోడ్లమీదకు పరుగులు తీశారు. గత శుక్రవారం సంభవించిన ఘోర భూకంపంలో 587 మంది మరణించారు. అప్పటి నుంచి ఏ చిన్న ప్రకంపన వచ్చినా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


