Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంధ్రప్రదేశ్ లో భూకంపం
posted on: Feb 19, 2026 8:10AM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో భూమి కంపించింది. పల్నాడు జిల్లాలో గురువారం (ఫిబ్రవరి 19) తెల్లవారు జామున భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
పల్నాడు జిల్లాలో భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది. వినుకొండకు దాదాపు 20 కొలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూమి అంతర్భాగంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. కాగా ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇలా ఉండగా వినుకొండ, దర్శి పరిసర ప్రాంతాలలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది.



.webp)


