TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కాళ్లకు మొక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ

Published on: Wed Feb 11, 2026 3:00PM

 

వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి జగన్ అవకాశం ఇవ్వకపోతే... సొంతగా పోటీ చేసి తన బలం చూపిస్తానని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. శాసనమండలిలో తన వాణి వినిపిస్తానని చెప్పారు. త్వరలోనే జగన్‌ను కలుస్తానని ఆయన పేర్కొన్నారు. టీటీడీ లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతానని దువ్వాడ వ్యాఖ్యానించారు. అలాగే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

అంతకముందు.. శాసన సభ ఆవరణలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను మాజీ సీఎం పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కాళ్లకు మొక్కారు దువ్వాడ. ఏం చేద్దామనుకుంటున్నావ్ శ్రీనివాస్? అని దువ్వాడను జగన్ పలకరించగా.. ధర్మాన ప్రసాదరావుతో ఉన్న ఇష్యూలపై మాట్లాడాలని ఆయన బదులిచ్చారు. దాంతో జగన్,  దువ్వాడను ఒకసారి కలవమని చెప్పి వెళ్లిపోయారు . ఈ భేటీ దువ్వాడ భవిష్యత్తు రాజకీయాలపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగన్‌తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం, పార్టీలో చేరే అవకాశాలు, సొంతంగా పోటీ చేయడం తదితర అంశాలు చర్చనీయాంశంగా మారాయి.