TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేవంత్ చేతుల మీదుగా ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు

Published on: Wed Oct 9, 2024 9:29AM

ఉపాధ్యాయ అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు  తెరపడింది. డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (అక్టోబర్ 9) నియామక పత్రాలు అందజేయనున్నారు. మొత్తం 10 వేల 6 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు రేవంత్ నియామక పత్రాలను అందజేయనున్నారు.

సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో రేవంత్  చేతుల మీదుగా ఉపాధ్యాయ అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోనున్నారు.  తెలంగాణ డీఎస్సీ 2024 ద్వారా హైదరాబాద్ నుంచి  హైదరాబాద్‌ జిల్లా  నుంచి అత్యధికంగా 761 మంది, పెద్దపల్లి నుంచి అత్యల్పంగా  82 మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.

 మొత్తం 11,062 టీచర్ పోస్టులకు గానూ 10,006 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల 1,056 స్పెషల్‌ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదు. ఇప్పటికే ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తయ్యింది. ఇక నియామక పత్రాలు అందుకోనున్న ఉపాధ్యాయ అభ్యర్థులంతా మధ్యాహ్నం 2 గంటల లోగా ఎల్బీ స్టేడియం చేరుకునేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.