Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు స్టేషన్ బెయిల్
posted on: Mar 15, 2026 4:00PM

మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనతో పాటు పుత్త మధు, ప్రియాంక రెడ్డికి కూడా అధికారులు బెయిల్ ఇచ్చారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అవసర మైన న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత వారిని విడుదల చేశారు. ఇదిలా ఉండగా మీడియా దృష్టికి చిక్క కుండా మహేష్ యాదవ్‌ను పోలీసులు స్టేషన్ నుంచి బయటకు పంపినట్లు సమాచారం. పోలీస్ వాహనాలను బయటకు తీసుకొచ్చి పరిస్థితిని సాధారణంగా ఉన్నట్లు చూపిస్తూ, అనంతరం ఎంపీని మరో కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు..



.webp)


