విజయవాడలో ఇంటర్నేషనల్ డ్రోన్ సమ్మిట్!
posted on: Oct 7, 2024 2:53PM
.webp)
విజయవాడ వేదికగా ఈ నెల 22, 23 తేదీలలో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సదస్సులో పాల్గొంటారు. అలాగే ఈ సమ్మిట్‌కు డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్‌సీల నుంచి దాదాపు 1,000 మంది ప్రతినిధులు హాజరౌతారు. ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు.
Latest YouTube Trending Video NEWS






