ప్రతి గంటకు ఓ మహిళ బలి

 

మనదేశంలో ప్రతి గంటకు ఓ మహిళ బలవుతుందని ఎస్‌ సీ ఆర్‌ బి తేల్చింది. దేశం వ్యాప్తంగా అమ్మాయిలపై ఓ వైపు అఘాయిత్యాలు పెరుగుతుండగా, మరోవైపు వరకట్న వేదింపులకు కూడా మహిళలు బలైపోతున్నారు.

2007 నుంచి 2011 మధ్య ఇలాంటి కారణాలతో మరణించిన మహిళ సంఖ్య ఘననీయంగా పెరిగింది. ఒక్క 2012లోనే దేశ వ్యాప్తంగా 8233 మంది మహిళలు వరకట్న వేధింపులకు బలైయ్యారు. అంటే దాదాపుగా ప్రతి గంటకు ఓ మహిళ ఈ కారణంతో మరణిస్తుంది.

అయితే వరకట్న సమస్యతో జరిగే మరణాలు కేవలం పేద,మధ్య తరగతి కుటుంబాలకే పరిమితం కాలేదు. సంపన్న కుటుంబాలలో కూడా ఇలా వేదింపులు కనిపిస్తున్నాయి. వరకట్న నిషేధ చట్టం, 1961 ప్రకారం.. కట్నం అడగడం, ఇవ్వడం, అంగీకరించడం నేరం. అయినా ఈ దురాచారం మన సాంఘిక వ్యవస్థలో విడదీయలేనంతగా పాతుకుపోయింది.