TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోదావరిలో కారు బోల్తా.. 20 మంది మృతి

Published on: Sat Jun 13, 2015 11:18AM

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తుఫాన్ వాహనం బోల్తాపడి గోదావరిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 22 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో 9మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. విశాఖజిల్లా అచ్యుతాపురం వాసులు తిరుపతి వెళ్లి వస్తుండగా వాహనం అదుపు తప్పి సుమారు 50 అడుగులు పైనుండి కింద పడటంతో వాహనం నుజ్జు నుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ల సాయంతో వాహనంలో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకుతీశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సీఎం పుష్కరాల నిమిత్తం పరిమిత సంఖ్యలో వాహనాలు అనుమతించాలని, మితిమీరిన వేగాన్ని నియత్రించాలని, కాలం చెల్లిపోయిన వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని రవాణా అధికారులకు కొన్ని ఆదేశాలను జారీ చేశారు.