Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పంత్, బుమ్రా ఫిట్‌నెస్‌పై అనుమానాలు.. క్రికెట్ అభిమానుల్లో టెన్షన్
posted on: Jul 16, 2025 3:08PM

రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్‌కు దూరమవుతారన్న ప్రచారం భారత్ క్రికెట్ అభిమానులను కలకవరపరుస్తోంది. ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో మూడు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు మధ్యలో దాదాపు పది రోజుల విరామం వచ్చింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మంఛెస్టర్‌లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా రేస్‌లో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండటంతో నాలుగో మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా రేసులో నిలుస్తుంది. అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కీలక ఆటగాళ్లు రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఆడతారా అనేది అనుమానంగా మారింది. వర్క్‌లోడ్ కారణంగా స్టార్ పేసర్ బుమ్రా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆడబోయేది లేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా కచ్చితంగా ఆడాలని, లేకపోతే ఆ మ్యాచ్‌లో పరిస్థితి టీమిండియాకు అనుకూలంగా ఉండదని చెబుతున్నారు. దీంతో బుమ్రాను ఆడించే విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
ఇక, మూడో టెస్ట్ మ్యాచ్‌లో గాయపడిన రిషభ్ పంత్ కూడా నాలుగో మ్యాచ్‌కు డౌట్‌గానే కనిపిస్తున్నాడు. పంత్ చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్‌లో పంత్ కీపింగ్ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు పంత్ అందుబాటులో ఉంటాడా అనేది అనుమానంగా మారింది. అయితే పంత్ వేలికి పెద్ద గాయం కాలేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సమాచారం. ఒకవేళ వీరిద్దరూ దూరమైతే మాత్రం జట్టుకు మాత్రం తీరని లోటే. కాగా, వరుసగా విఫలమవుతున్న కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టి నాలుగో టెస్ట్‌లో సాయి సుదర్శన్‌ను తీసుకునే అవకాశం ఉందంటున్నారు.


.webp)
.webp)


