ట్రంప్‌ విషం ఈసారి భారత్‌ మీద!

 

వివాదాస్పద వ్యాఖ్యలకు, విపరీతమైన మాటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ట్రంప్‌ ఈసారి భారత్ మీదకి తన వాగ్బాణాలకు ఎక్కుపెట్టారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ పౌరుల ఓట్లను గెల్చుకునే ప్రయత్నంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలను చేశారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. అమెరికా పౌరులైన ఆఫ్రికన్లలో కనీసం 58శాతం నిరుద్యోగంలో మునిగిపోయి ఉన్నారనీ, వారందరికీ తాను తగిన ఉద్యోగాలను కల్పిస్తాననీ ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా పేర్కొన్నారు.

 

అందుకోసం ఇండియా, చైనా, జపాన్‌, వియత్నాం.... వంటి దేశాల నుంచీ ఉద్యోగాలను వెనక్కి తీసుకుంటామనీ చెప్పారు. ఔట్‌సోర్సింగ్‌ ద్వారా కానీ నేరుగా కానీ అమెరికాకు సంబంధించిన సాఫ్టవేర్‌ ఉద్యోగాలలో అధికశాతం ఇండియా, చైనా వంటి దేశ ప్రజలు దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ ఉద్యోగాలకు గడ్డుకాలం రానుందా అన్న భయం కలుగక మానదు. తరచూ చైనా, జపాన్‌ల మీద విరుచుకుపడే ట్రంప్‌ భారతదేశం విషయంలో కాస్త సానుకూలంగానే ఉండేవాడని చాలామందికి ఆశగా ఉండేది. కానీ ఈ వ్యాఖ్యలతో అలాంటి భ్రమలన్నీ తేలిపోయాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu