TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీలోకి డొక్కా!

Published on: Mon Aug 3, 2015 11:43AM

 

కాంగ్రెస్ పార్టీనుండి ఇప్పటికే చాలామంది నేతలు ఇతర పార్టీల్లోకి మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సీనియర్ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన గతంలోనే కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన తరువాత తాను వైఎస్సార్ పార్టీలోకి వెళుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ తాను మాత్రం ఏ పార్టీలోకి చేరడంలేదంటూ చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా డొక్కా టీడీపీలోకి చేరేందుకు రాయపాటి సాంబశివరావు రాయబారిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాయపాటి డొక్కా టీడీపీ లోకి చేరడం వల్ల పార్టీకి కలిగే ప్రయోజనాలకు పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబుకు వివరించినట్టు.. దానికి చంద్రబాబు కూడా అంగీకరించినట్టు రాజకీయ విశ్లేషకులు అనకుంటున్నారు. కాగా ఈ నెల 15వ తేదీన డొక్కా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని.. ఇందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు.