Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిమ్మరసం నీళ్లు తాగితే.. షుగర్ తగ్గుతుందా?
posted on: May 14, 2025 12:01PM

నిమ్మకాయ చాలా పానీయాలలో ఉపయోగిస్తారు. అటు వంటలలోనూ, ఇటు స్వీట్ల లోనూ, మరొక వైపు రిఫ్రెషింగ్ పానీయాలలోనూ నిమ్మకాయను ఉపయోగిస్తారు. చాలామంది ఉదయాన్నే నీటిలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల శరీరంలో షుగర్ కూడా తగ్గుతుందని కొందరు అంటారు. ఈ కారణంగా చాలామంది షుగర్ పేషెంట్ లు నిమ్మరసం కలిపిన నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల నిజంగానే శరీరంలో షుగర్ శాతం తగ్గుతుందా? నిమ్మరసం నీరు శరీరంలో షుగర్ తగ్గించడంలో సహాయపడుతుందా? తెలుసుకుంటే..
నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి నిమ్మరసం కలిపిన నీరు రక్తంలో చక్కెరను తగ్గించదు, కానీ చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ రెండింటికి తేడా ఏంటని చాలా మంది అయోమయానికి గురవుతూ ఉంటారు.
తీసుకునే ప్రతి ఆహారంలో ఉండే గ్లూకోజ్ పరిమాణాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ను నిర్ణయిస్తారు. అలాగే నిమ్మకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ను గమనిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఆకస్మికంగా పెరగకుండా చేస్తాయి.
నిమ్మకాయలో కరికే ఫైబర్ ఉంటుంది. ఈ కరిగే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతూ రక్తంలో శోషించబడుతుంది. తద్వారా రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది. సహాయపడుతుంది. అలాగే కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. నిమ్మరసం కలిపిన నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి.
నిమ్మకాయ నీరు హైడ్రేషన్ ను నిర్వహిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది. ఈ కారణంగా నిమ్మరసాన్ని వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసానికి చక్కెర, చక్కెర సంబంధిత పదార్థాలు జోడించడం వల్ల షుగర్ ఉన్నవారికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.
నిమ్మరసంలో విటమిన్-సి ఉంటుంది. ఇది వాపును, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ కారణంగానే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటివి చేసినప్పుడు నిమ్మరసం నీటిలో కాసింత జీలకర్ర పొడి కూడా కలిపి తాగమని చెబుతూ ఉంటారు.
నిమ్మకాయ నీరు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

.webp)

.webp)
.webp)


