Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయా? అసలు నిజాలు ఏంటంటే!
posted on: Feb 21, 2026 3:24PM
.webp)
చాలామందికి బాదం పప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక అనే పేరు బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు. బాదం బంకను నీటిలో నానబెట్టుకుని తింటుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో బాదం బంక వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న బంక గడ్డల్లా ఉంటుంది. నీటిలో వేసి సుమారు 2 గంటల సేపు నానబెడితే బాదం బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీన్ని నేరుగా తింటారు, నీటిలో కలిపి తాగుతారు, ఇందులో సబ్జా, పంచదార వంటివి కూడా కలుపుకుని తాగుతారు. వేసవిలో పానీయాలలో బాదం బంకను యాడ్ చేసుకుంటారు. ఇది శరీరానికి చలువ చేస్తుందని చెబుతారు. అయితే.. బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయని కొందరు అంటుంటారు. దీని వెనుక గల నిజం ఏమిటో తెలుసుకుంటే..
మొటిమలకు కారణం..
చర్మం మీద మొటిమలు, కురుపులు వంటివి వేడి వల్ల వస్తాయి. దీని వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది. ఈ వేడిని తగ్గించడం ద్వారా మొటిమలు, కురుపులు తగ్గించడంలో బాదం బంక చక్కగా.. ఔషధంలా పనిచేస్తుంది.
బాదం బంక.. చర్మ ప్రయజనాలు..
బాదం బంకను తీసుకోవడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
బాదం బంకను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయానికి ఈ బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీనికి కొంచెం చల్లని నీరు కలపాలి. ఇందులో కొంచెం నిమ్మరసం కలపాలి. దీన్ని డీహైడ్రేట్ పానీయంలా తీసుకోవాలి. కనీసం 3 నుండి 4 రోజులు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
బాదం బంక ఎందుకు మంచిది?
బాదం బంక తినడం వల్ల సహజంగానే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది. బాదం బంకలో ఉండే యాంటీ-ఏజింగ్ లక్షణాల కారణంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఇది శరీరం లోపలి నుండి విషాన్ని తొలగిస్తుంది. మొటిమలు, ముడతలు, వడదెబ్బ వంటి సమస్యలను తగ్గిస్తుంది. బాదం బంక తినడం వల్ల చర్మానికి మెరుపు, యవ్వనం లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
*రూపశ్రీ.






