Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎముకలను దెబ్బ తీసే ఆహారాల గురించి తెలుసా?
posted on: Mar 6, 2025 9:30AM
.webp)
ఎముకలు శరీర ఫిట్‌నెస్ లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. అయితే ఎముకల ఆరోగ్యం మీద శ్రద్ద చూపే వారు తక్కువే. ఏవైనా టెస్ట్ లు చేయించుకున్నప్పుడు తప్పితే ఎముకలు బలంగా ఉన్నాయా లేదా బలహీనంగా ఉన్నాయా అనే విషయం తెలుసుకోలేరు. అయితే చాలా వరకు ఎముకలు బలహీనంగా మారడానికి ఆహారం, జీవనశైలి కారణం అవుతుంది. కొన్ని ఆహారపు అలవాట్లు శరీరానికి స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి. వెంటనే ఈ ఆహారపు అలవాట్లు మానేయడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు అంటున్నారు.
ఉప్పు..
ఉప్పు లేని కూర తినలేము అనే విషయం తెలిసిందే. అయితే అసలు ఉప్పు లేకపోయినా ఆరోగ్యానికి ముప్పే.. అలాగే ఉప్పు ఎక్కువ తిన్నా ఆరోగ్యానికి ముప్పే.. ముఖ్యంగా ఎముకలకు చాలా ముప్పు వాటిల్లుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీని కారణం ఎముకలు బలహీనం అవుతాయి.
ధూమపానం, మద్యపానం..
ధూమపానం, మద్యపానం అలవాట్లు శరీరంలో కాల్షియం, విటమిన్-డి స్థాయిలను తగ్గిస్తాయి. ఇవి ఎముకలను దెబ్బతీస్తాయి. ఈ అలవాట్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే ఎముకల బలహీనత, ఎముకలు దెబ్బతినడం, కీళ్లు బలహీనంగా మారడం వంటి సమస్యలు వస్తాయి.
చక్కెర..
చక్కెర ఎక్కువగా తినడం వల్ల కాల్షియం, మెగ్నీషియం శోషణ దెబ్బతింటుంది. అంటే కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకున్నా సరే.. వాటిని శరీరం గ్రహించలేదు. ఈ కారణంగా ఎముకలు బలహీనం అవుతాయి.
వ్యాయామం..
శరీరం దృఢంగా ఉండాలన్నా, ఎముకలు బలంగా మారాలన్నా శరీరానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం చేయకపోతే ఎముకల చలనం తగ్గుతుంది. ఈ కారణంగా ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారే అవకాశం ఉంటుంది.
శీతల పానీయాలు..
శీతల పానీయాలు చాలా మందికి చాలా ఇష్టమైన ఎంపిక. ఎర్రటి ఎండలో చల్లగా కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కానీ కార్బోనేటెడ్ పానీయాలలో ఉండే ఫాస్పోరిక్ ఆమ్లం ఎముకల నుండి కాల్షియం ను గ్రహిస్తుంది. వాటిని బలహీనపరుస్తుంది.
జీవనశైలి..
మంచి జీవనశైలి ఎప్పుడూ శరీరాన్ని, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. సరైన ఆహారం ఎంపిక జీవనశైలిలో ప్రధానం. అలాగే వ్యాయామం కూడా మంచి ఎంపికగా ఉంటుంది. ఇవి రెండూ శరీరాన్ని, ఎముకలను బలంగా మార్చుతాయి.
*రూపశ్రీ.






