Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమా? సైన్స్ ఏం చెబుతోందంటే..!
posted on: Mar 6, 2026 2:17PM

బిజీగా గడిపిన తర్వాత పురుషుల కంటే మహిళలు ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఆడవాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చాలామంది మగాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ సైన్స్ మాత్రం ఆడవారి పరిస్థితి నిజమేనని చెబుతోంది. సైన్స్ కూడా మహిళలు పురుషుల కంటే ఎక్కువ అలసిపోతారని, వారికి ఎక్కువ నిద్ర అవసరమని చెబుతోంది. ఇది కేవలం సోమరితనం లేదా విశ్రాంతి తీసుకోవడానికి చెబుతున్న విషయం కాదని, దాని వెనుక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో అర్థం తెలుసుకుంటే..
మల్టీ టాస్కింగ్.. మెదడు సంక్లిష్టత..
నిద్ర యొక్క అతి ముఖ్యమైన విధి మెదడును బాగుచేయడానికి, తిరిగి శక్తిని నింపడానికి సమయం కేటాయించడం. పరిశోధన ప్రకారం స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పనులు చేస్తారు. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒకేసారి ఆలోచిస్తారు. మెదడును తీవ్రంగా, ఎక్కువ కాలం ఇలా ఆలోచించినప్పుడు, అది కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మహిళల మెదళ్ళు రోజంతా ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. కాబట్టి వారికి మరింత గాఢ నిద్ర అవసరం అవుతుంది.
హార్మోన్ల మార్పులు..
జీవితంలోని వివిధ దశలలో మహిళల శరీరాలు గణనీయమైన హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. ఋతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్ వంటి సమయాలలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి.
గర్భం..
గర్బం దాల్చిన కాలంలో శరీర బరువు పెరగడం, శారీరక మార్పులు అలసటను పెంచుతాయి.
మెనోపాజ్.
మెనోపాజ్ దశలో వేడి ఆవిర్లు, చెమటలు పట్టడం వంటి సమస్యలు తరచుగా నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. దీని కారణంగా శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. అందుకే ఎక్కువగా నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది.
నిద్ర నాణ్యత..
పురుషుల కంటే స్త్రీల నిద్ర తక్కువగా ఉంటుంది. ఇంట్లో శబ్దాలు, పిల్లలు ఏడుపు లేదా ఏదైనా చిన్న కదలికలకు కూడా వారు తొందరగా మేల్కొంటారు. ఇంకా మహిళలు నిద్రలేమి, రెస్ట్‌లెస్ కాళ్ల సిండ్రోమ్ వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు. తరచుగా నిద్ర అంతరాయాల కారణంగా, శరీర మరమ్మత్తుకు అవసరమైన గాఢ నిద్ర వారికి లభించదు. అందువల్ల ఉదయం మేల్కొనేటప్పుడు అలసటగా, ఇంకాసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది.
మానసిక ఆరోగ్యం, ఒత్తిడి..
సామాజిక, కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు తరచుగా ఎక్కువ మానసిక ఒత్తిడి, ఆందోళనను అనుభవిస్తారు. ఒత్తిడి నేరుగా నిద్రను ప్రభావితం చేస్తుంది. మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. తగినంత నిద్ర లేకపోవడం ఈ ఒత్తిడిని మరింత పెంచుతుంది, ఇది ఒక చక్రంలా కొనసాగుతుంది.
బాగా నిద్రపోవడానికి ఏమి చేయాలి?
మహిళలకు నిద్ర లేకపోవడం అలసటను మాత్రమే కాదు.. గుండె జబ్బులు, ఆందోళన, నిరాశ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
పడుకోవడానికి, మేల్కొనడానికి ఒక సమయాన్ని నిర్థేశించుకోవాలి.
నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వాడటం మానేయాలి.
మధ్యాహ్నం తర్వాత టీ, కాఫీ తాగకూడదు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...






