Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిన రాజప్ప ఎన్నిక చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలు
posted on: Jul 6, 2019 7:41PM

మొన్న మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప 4 వేల ఓట్ల మెజారిటీతో వైసిపి అభ్యర్థి తోట వాణి పై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే చినరాజప్ప దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో ఆదాయ వనరులతో పాటు తన పై ఉన్న క్రిమినల్ కేసులను దాచిపెట్టి తప్పుడు డిక్షరేషన్ ఇచ్చారని పేర్కొంటూ వాణి ఏపీ హైకోర్టులో అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ, చినరాజప్ప 2007లో ఓబులాపురం మైనింగ్ కార్యాలయంపై దాడి కేసులో 15వ ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. టిడిపి ప్రభుత్వం అధికారం లో ఉన్నపుడు ఆ కేసు క్లోజ్ చేయమని రెండుసార్లు ప్రభుత్వ జీవోలు విడుదల చేయించి కోర్టుకు పంపించారని అయితే కోర్టు వాటిని తిరస్కరించి ఇప్పటికీ వారెంట్‌ను కొనసాగిస్తోందని తోట వాణి తెలిపారు. కానీ ఎన్నికల అఫిడవిట్లో దీని గురించి అయన ప్రస్తావించ లేదన్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా మరియు మాజీ ఎమ్మెల్సీగా పెన్షన్ అందుకుంటూ వాటిని దాచిపెట్టి కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే తనకు ఆదాయం వస్తున్నట్టు చినరాజప్ప అఫిడవిట్ లో ప్రకటించారని ఆరోపించారు. ఈ ఆధారాలతో హైకోర్టు చినరాజప్పపై ఆరు నెలల్లో అనర్హత వేటు వేస్తుందని, ఆ తరువాత తానే పెద్దాపురం ఎమ్మెల్యే అవుతానని తోట వాణి తెలిపారు.






