Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి.. మంత్రుల మధ్య టెండర్ల మంట!
posted on: Oct 11, 2025 1:07PM

తెలంగాణ కాంగ్రెస్ వివాదాలతో సహవాసం చేస్తున్నదా అనిపిస్తున్నది. నిత్యం అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలతో సతమతమౌతూనే ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య వార్ జరిగింది. అధిష్టానం రంగంలోకిదిగి వారి మధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. అది అలా ఫుల్ స్టాప్ పడిందో లేదో.. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో అలిగి.. తనకు టికెట్ రాకుండా చేసిన వారి పేరు త్వరలోనే బయటపెడతానంటూ మీడియాకు ఎక్కారు. దీంతో ఆయనను బుజ్జగించడానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ ఎపిసోడ్ అలా ముగిసిందో లేదో.. ఇలా మరో ఇద్దరు మంత్రుల మధ్య వార్ రచ్చకెక్కింది.
మంత్రి పొంగులేటి తన శాఖ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. దేవాదాయ శాఖ పరిధిలోని టెండర్లలో మంతి పొంగులేటి జోక్యమేంటంటూ కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి అనుచిత జోక్యం చేసుకుంటున్నారంటూ ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఆమె భర్త కొండా మురళి అధిష్ఠానానికి లేఖ రాశారు. ఇక ఇప్పుడు మంత్రి కొండా సురేఖ పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో మరో తలనొప్పి మొదలైనట్లైంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిన సమయంలో కొత్తగా కొండా మురళి, పొంగులేటి మధ్య వార్ మరిన్ని ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టినట్లైంది. వాస్తవానికి వరంగల్ ఇంచార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన నాటినుంచి మంత్రి కొండా సురేఖ్ అసంతృప్తితోనే ఉన్నారు. జిల్లాకు చెందిన అంశాల్లో పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు తెలియకుండానే, తనను సంప్రదించకుండానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనీ గత కొంత కాలంగా కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడా అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.
ఇంతకీ విషయమేంటంటే... మేడారం జాతర సమీక్ష సమావేశం లో మంత్రి పొంగు లేటి తీరుపై కొండా సురేఖ, ఆమె భర్త అసంతృప్తి వ్యక్తం చేశారు.వరంగల్ జిల్లా రాజకీయాల లో పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకోవడంతో కొండా దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని మండి పడ్డారు. టెండర్ల వ్యవహారా లపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.ఇదే విషయాన్ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపారు. తాజాగా మంత్రి కొండా సురేఖ పొంగులేటి వ్యవహారశైలిపై అధిష్ఠానాని స్వయంగా ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికిసమాయత్తమౌతున్నారు. చూడాలి మరి ఈ వివాదాన్ని కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుందో?


.webp)



