Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పిన్నెల్లి బ్రదర్స్ అదృశ్యం
posted on: May 17, 2024 4:47PM
మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.
ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పల్నాడు తదితర జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసీ కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసింది.తాజాగా, అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్ మన్లను కూడా వదిలేసిన ఆయన తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ పరిణామంతో పిన్నెల్లి గన్ మన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.






