Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దివ్యాంగుడు కష్టానికి మోక్షం కల్పించిన కేంద్ర మంత్రి
posted on: Feb 20, 2026 8:32PM
.webp)
ఆయన పేరు నల్లి పోలయ్య.. పాతపట్నం మండల కేంద్రానికి చెందిన పోలయ్య.. పుట్టుకతో వికలాంగుడు.. మూడు చక్రాల ట్రై సైకిల్ పై అనేక ఆపసోపాలు పడుతూ.. తన దైనందిన కార్యక్రమాలు చేసుకునేవాడు.. ఇలా ఓ రోజు పాతపట్నంలో వెళుతూ ఉండగా.. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ ఫోటోతో ఉన్న ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ ఆయనకు తారసపడింది. కష్టం లేకుండా.. వేరొకరి తోడు అవసరం లేకుండా తన పనులు తాను చేసుకోవాలి అంటే ఎలక్ట్రిక్ సైకిల్ నే శ్రేయస్కరం అని భావించిన పోలయ్య.. గత సోమవారం నాడు శ్రీకాకుళం నగరంలో రామ్మోహన్ నాయుడు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి హాజరయ్యారు.
జిల్లా వ్యాప్తంగా వచ్చిన వినతులతో రామ్మోహన్ నాయుడు కార్యాలయం కిక్కిరిసి ఉన్నా.. పోలయ్యను ముందుకు తీసుకువచ్చారు ఆయన సెక్యూరిటీ సిబ్బంది. కేంద్ర మంత్రి ఎదురుగా తన కష్టం అంతా చెప్పుకున్న పోలయ్య.. తనకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ అవసరం ఉందని.. దాన్ని ఇప్పించాలని కోరాడు. దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు.. తన సిబ్బందికి తగు ఆదేశాలు ఇచ్చారు. శుక్రవారం నాడు పాతపట్నంలో ఉన్న పోలయ్యకు పలాస నుండి ఓ ఫోన్ వచ్చింది.. కేంద్ర మంత్రి చెప్పడంతో మీకు ఒక ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ మంజూరు అయిందని.. మీరు మీ ధృవీకరణ పత్రాలతో వచ్చి.. దానిని తీసుకోవాలని చెప్పడంతో.. పోలయ్య ఆనందంతో ఉబ్బితబ్బిబి అయ్యాడు.
తన కష్టం చెప్పగానే ఆగమేగాల మీద దానికి పరిష్కార మార్గం చూపిన రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. సుమారు ఏభై నాలుగు వేల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ వల్ల ఇకపై తన దైనందిన కార్యక్రమాలు సులభతరం అయ్యాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కాగా వికలాంగులు, దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే విశేష కృషి రామ్మోహన్ నాయుడు చెయ్యగా.. సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన పరికరాలు గడచిన కొన్నేళ్లుగా అందిస్తూ ఉన్నారు.
అలెంకో, సామజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖలను సమన్వయము చేసుకుని మూడు మెడికల్ క్యాంప్ లను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే 343 ఎలక్ట్రిక్ సైకిళ్ళు, 58 ట్రై సైకిళ్ళు, ఆర్టిఫిషియల్ లెగ్స్, హాండ్స్, వినికిడి యంత్రాలను విశేషంగా అందించారు. వీటితో పాటుగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రామ్మోహన్ నాయుడు చొరవతో ప్రతీ నెల మూడవ శుక్రవారం వికలాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సైతం వికలాంగులకు ఉపయుక్తంగా మారుతోంది. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా… తమకు పూర్తి తోడ్పాటు అందించేవిధంగా వినూత్న కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ.. తమ కష్టాలను గట్తెక్కిస్తున్న కేంద్రమంత్రికు సిక్కోలు వాసులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.



.webp)


