Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ డైరెక్టర్
posted on: Dec 4, 2018 4:28PM

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. తాజాగా ఈ జాబితాలో నటుడు, డైరెక్టర్ రవి బాబు కూడా చేరిపోయారు. నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణలోనే మంచి మనిషి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అని ఆయన ఓడిపోతే అంతుకు మించి దురదృష్టం మరోటి ఉండదని వ్యాఖ్యానించారు. ఆయనకు ఓటేసి గెలిపించండని ప్రజలను అభ్యర్థించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండలో ఇరవై ఏళ్ల నుంచి అభివృద్ది జరగలేదని కేసీఆర్ అన్నారని.. ఆయన అసలు ముఖ్యమంత్రేనా అనే అనుమానం వస్తుందన్నారు. వేలకోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ది జరిగిందని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీకి నిధులు ఎందుకు విడుదల చేయలేదో తన కొడుకు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను అడిగి తెలుసుకోమన్నారు. నల్గొండ నుంచి పోటీచేద్దామనుకున్న కేసీఆర్‌కు ఓడిపోతానని తెలిసి పోటీ చేయలేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవాలని కోట్ల రూపాయలు గ్రామాల్లో పంచుతున్నారని,నల్గొండ ఆత్మగౌరవం గెలుస్తుందా? దోపిడీ చేసిన సొమ్ము గెలుస్తుందో డిసెంబర్ 11న తెలుస్తుందన్నారు.






