‘కలిసి ఉంటే కలదు సుఖం' అంటున్న నితిన్, దిల్ రాజు
posted on Jul 30, 2013 11:59AM
.jpg)
నితిన్ హీరోగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'దిల్' సినిమాతో నిర్మాతగా పరిచయమైన రాజు...ఆ సినిమా విజయం తరువాత ‘దిల్ రాజు' గా ఇండస్ట్రీ లో ఫేమస్ అయినా సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా నితిన్ తో దిల్ రాజు మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా కు ‘కలిసి ఉంటే కలదు సుఖం' అనే టైటిల్ ను కూడా సెలెక్ట్ చేశారు. రొమాన్స్ అండ్ కామెడీతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈచిత్రం తెరకెక్కబోతోందని అంటున్నారు.
ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆతరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'హార్ట్ ఎటాక్' సినిమా చేయడానికి అ౦గీకరించాడు. ఇక దిల్ రాజు ప్రస్తుతం..హరీష్ శంకర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రం నిర్మిస్తున్నాడు. ఆయన నిర్మించిన 'ఎవడు' వచ్చే నెలలో విడుదలకు రెడీగా ఉంది.