TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పెల్లింగ్ సరిగా రాయడం రాదు.. డిగ్గీ పై కేటీఆర్

Published on: Fri Jun 3, 2016 3:13PM

 

తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు నిన్నఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈవేడుకల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ కేసీఆర్ పై విమర్శలు చేసిన సంగతి కూడా విదితమే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. కేసీఆర్‌ ఉత్సవాలను జరిపిస్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో పేద ప్రజలు చనిపోతుంటే.. మరోవైపు వేడుకలు చేసుకుంటున్నారు. ఇది చాలా సిగ్గుచేటు’ అని దిగ్విజయ్‌ ట్వీట్‌ చేశారు.

 


అయితే ఇప్పుడు డిగ్గీ చేసిన ట్వీట్లకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్పందించి చురకలు అంటించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ స్పెల్లింగ్‌ రాయటం కూడా తెలియదు. ఆయన కేసీఆర్‌ను విమర్శిస్తారు!’ అంటూ విమర్శించారు.