దిగ్విజయ్ జోక్స్

posted on: Oct 28, 2013 4:13PM

 

సినిమాలలో బ్రహ్మానందమే కాదు, ఒక్కోసారి కాంగ్రెస్ వాళ్ళు కూడా బలే జోకులేసి జనాలను నవ్విస్తుంటారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖల గురించి అమెరికా, జపాన్లో ఉన్నవాళ్ళకి కూడా ఈపాటికి తెలిసిపోయుంటుంది. కానీ ఎప్పుడూ డిల్లీలోనే ఉండే మన రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ వారికి మాత్రం ఆవిషయం తెలియనే తెలియదట. మీడియావాళ్ళు చెపితేనే తెలిసిందని ఇంకా ఆ లేఖలో సారాంశం ఏమిటో చూడవలసి ఉందని జోక్ వేసారు.

 

క్రిందటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘జగన్ మోహన్ రెడ్డిది మా కాంగ్రెస్ పార్టీది సేమ్ టు సేమ్ డీ.యన్.యే’, అని మళ్ళీ డిల్లీ వెళ్ళిన తరువాత కూడా ‘జగన్ నా కొడుకు వంటి వాడు’ అని మరోసారి కన్ఫర్మ్ చేసిన ఆయన, ఈసారి మాత్రం తమ సంబంధాల గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదుట. బహుశః జగన్ మొన్న హైదరాబాదులో సోనియమ్మని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన తరువాత కూడా ఇంకా ‘జగన్ నా కొడుకు వంటి వాడే’ అనాలంటే చాల గుండె దైర్యం ఉండాలి కదా?

 

మళ్ళీ రెండు పార్టీలలో హార్మోన్స్ లలో ఏమయినా మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నాయా? అని ప్రజలకి అనుమానం కలిగేలా ఆయన మౌనం వహించినప్పటికీ, ఇంకా డీ.యన్.యే.లు మార్చుకోవడం ఎవరి తరమూ కాదుకదా!

google-ad-img
    Related Sigment News
    • Loading...