Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎముకల దృఢత్వానికి వ్యాయామం...!
posted on: Apr 8, 2021 9:30AM
వయసు పెరుగుతున్నకొద్దీ కండరాల్లో పటుత్వం తగ్గినట్టే, ఎముకలూ పెళుసుబారుతాయి. ఆరోగ్యానికి, దృఢత్వానికి ముఖ్యంగా కాల్షియం, విటమిన్- డి చాలా అవసరం. ఈ రెంటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్- కె ఎముకల నిర్మాణానికి, ఎముకలు పెళుసుబారకుండా ఉండడానికి అత్యవసరం. పాలు, పెరుగు ముఖ్యమైన కాల్షియాన్ని, ఫాస్ఫరస్‌ను అందిస్తాయి. కొన్ని రకాల ఆకుకూరల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. పప్పు ధాన్యాల నుంచి; పాలు, పాల ఉత్పత్తుల నుంచీ మాంసకృత్తులు లభిస్తాయి. విటమిన్ - డి కి మూలం సూర్యరశ్మి. అలాగే ఫోర్టిఫై చేసిన పాల వల్ల కాల్షియం, విటమిన్ - డి రెండూ లభిస్తాయి.
ఇలా సమతుల ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. అయితే ఎక్కువ మోతాదులో ఉప్పు, కూల్ డ్రింక్స్, మాంసాహారం, కాఫీ తీసుకోవడం; ధూమపానం చేయడం; శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల ఎముకలు పెళుసు బారే అవకాశం ఉంది. అలవాటు లేకపోయినా ఇప్పుడైనా తేలిక పాటి వ్యాయామాలు మొదలుపెడితే ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు. వ్యాయామం అంటే జిమ్ లకే వెళ్లక్కర లేదు. ఇంట్లోనూ తేలికపాటి ఆసనాలు వేయవచ్చు. నడక, సైక్లింగ్, స్కిప్పింగ్, జాగింగ్ రోజూ చేసినా ఎముకలు దృఢంగా ఉంటాయి.






