భారతరత్నకు సచిన్ కాదని ధ్యాన్‌చంద్

 

Dhyan Chand Sachin Tendulkar, Dhyan Chand recommended over Tendulkar for Bharat Ratna

 

 

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు నిరాశే ఎదురైంది. క్రీడా మంత్రిత్వ శాఖ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి క్రికెట్ దిగ్దజం సచిన్ టెండూల్కర్ పేరును కాదని ధ్యాన్ చంద్ పేరును సిఫార్సు చేసింది. ధ్యాన్ చంద్ మరణించిన 25 ఏళ్ల తర్వాత ఆయన పేరును భారత రత్న అవార్డుకు సిఫార్సు చేశారు. క్రీడారంగం నుంచి దేశంలో భారతరత్నకు సిఫార్సు అయిన మొదటి పేరు ధ్యాన్ చంద్‌దే కావడం విశేషం.

 

సచిన్ టెండూల్కర్ పేరును కాదని ధ్యాన్ చంద్ పేరును సిఫార్సు చేయడాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ సమర్ధించుకుంది. సచిన్ పట్ల తమకు గౌరవం ఉందని, కాని ధ్యాన్ చంద్ దేశ క్రీడాచరిత్రలో ఉత్తమ స్థానంలో ఉండదగినవారని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీప్ దేవ్ అన్నారు. ప్రధాని కార్యాలయానికి ఒక్క పేరును మాత్రమే సిఫార్సు చేయాల్సి ఉంటుందని తెలిపారు.



ధ్యాన్ చంద్ 1928, 1932, 1936 సంవత్సరాల్లో వరుసగా ఒలింపిక్స్‌లో భారతదేశానికి హాకీలో స్వర్ణపతకాలు సాధించి పెట్టాడు. భారత హాకీ చరిత్రకు ఇది చాలా గర్వకారణమని, ధ్యాన్ చంద్‌కు ఈ అవార్డు వస్తుందని తాము ఆశిస్తున్నామని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రా అన్నారు.