చెన్నై టెస్ట్ : ఆస్ట్రేలియా పై ధోని డబుల్ ధమాకా

Publish Date:Feb 24, 2013

 

 

dhoni century, kohili century, india vs Australia, Australia india

 

 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో ఇండియా సెంచరీల మోత మోగించింది. మూడోరోజు సెంచరీ చేస్తాడనుకున్న మాస్టర్ సచిన్ అభిమానులను నిరాశపరిచిన కోహ్లీ, ధోనిలు మాత్రం అదరగొట్టారు. సచిన్ టెండూల్కర్ 81 పరుగుల చేసి లియాన్ బౌలింగులో అవుటయ్యారు. ఆతరువాత క్రీజులో వచ్చిన ధోని తన ధనాధన్ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 206 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 107 పరుగులు చేసి అవుటయ్యాడు. వరుసగా వికెట్లు పోతున్నా ధోనీ నిబ్బరంగా ఆడుతూ 200 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం స్కోరు 515 ఎనిమిది వికెట్లు కోల్పోయింది.  ఆసీస్ పై ఇండియా 135పరుగుల ఆధిక్యం సాధించింది.

ధోనీ నాలుగువేల పరుగుల మైలు రాయిని దాటడమే కాకుండా తొలిసారి డబుల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో డబుల్ చేయడం ధోనీకి ఇదే తొలిసారి. 231 బంతుల్లో ద్విశతకం చేసిన ధోనీ 21 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. ధోనీ ఇప్పటి వరకు 74 టెస్టుల్లో ఆరు సెంచరీలు, 28 అర్ధసెంచరీలు చేశాడు. 2005 డిసెంబర్ 5న ధోనీ తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. మళ్లీ అదేగట్టపై ధోనీ తొలి డబుల్ సెంచరీ చేశాడు.