Latest News
తెలంగాణలో పోలీసు భార్యల ధర్నా
posted on: Oct 24, 2024 2:07PM
కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో పోలీస్ కుటుంబాలు చేస్తున్న ధర్నాను సిరిసిల్ల ఎమ్మెల్యే, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పరార్శించారు . తమ భర్తలతో కూలీ పనులు చేయిస్తున్నారని పోలీసు కుటుంబాలకు చెందిన భార్యలు ధర్నా చేశారు ధర్నా చేస్తున్న వారిని కెటీ ఆర్ పరామర్శించారు శాంతి భధ్రతలను కాపాడటంలో కీలక బాధ్యత వహించే పోలీసులకు వెట్టిచాకిరి ఎక్కువైందని భార్యలు ఆరోపించారు. 24 గంటల డ్యూటీ నెపంతో తమ భర్తలను కుటుంబాలకు దూరం చేయడం దారుణమని పోలీస్ కుటుంబాలకు చెందిన భార్యలు ఆరోపించారు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అమలు చేయాలన్నారు. ఆందోళన కారులను సిరిసిల్లా డి ఎస్పీ పరామర్శించారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తమ భర్తలను రక్షక భటులుగా గుర్తించకుండా ఇళ్లలో కూలీ పని చేయిస్తున్నారని వారు ఆరోపించారు ప్రభుత్వ ఉద్యోగులు అని పెళ్లి చేసుకుంటే చివరకు కూలీ పనులు చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు.


.webp)



