Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ధర్మానకు సమైక్య సెగ
posted on: Aug 30, 2013 8:42PM

సీమాంద్రలో రోజు రోజుకు సమైక్య సెగలు మరింత ఎక్కువ అవుతున్నాయి. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న తేడా లేకుండా అందరు నాయకులకు సమైక్య సెగలు తప్పటం లేదు. తాజాగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు నిరసనలు ఎదురయ్యాయి. జిల్లాలోని శుక్రవారం నిర్వహించిన సమైక్య సమరనాధం సభలో ధర్మాన ప్రసంగాన్ని సమైక్య వాదులు అడ్డుకున్నారు.
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయాలని నినాదాలు చేస్తూ ధర్మాన ప్రసంగానికి అడ్డుతగిలారు.అయితే ముందు ఆందోళన కారులకి సర్ధి చెప్పాలని ప్రయత్నించిన ధర్మాన ఒక దశలో సహనం కొల్పోయి రాజీనామ చేయనని తెగేసి చెప్పారు.
దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ధర్మాన మాత్రం తమ వాయిస్ చట్ట సభలో వినిపించడానికి మేం పదవుల్లో కొనసాగాలని అందుకే రాజీనామా చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. దీంతో ధర్మానపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి.


.jpg)



