Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చెత్తను చంకనెత్తుకున్న ధర్మాన!మంత్రి పదవి కోసం ఇంత కక్కుర్తా?
posted on: Jan 5, 2022 7:55PM
ధర్మాన ప్రసాద్ రావు సీనియర్ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వైఎస్సార్ మొదలు కిరణ్ కుమార్ రెడ్డి వరకు అనేక మంది ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రిగా శాసన సభలో, ధర్మాన అనేక సందర్భాలలో జగన్ రెడ్డిపై అనేక సందర్భాలలో ధర్మానుగ్రహం వ్యక్త పరిచారు. జగన్ రెడ్డిని బహుశా ఆయన విమర్శించినంతగా,మరో మంత్రి ఎవరూ విమర్శించి ఉండరు. కానీ, అదే ధర్మాన ప్రసాద రావు, వైసీపీ పంచన చేరారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో స్థానం మాత్రం దక్కలేదు.ధర్మాన సోదరుని మంత్రి వర్గంలో స్థానం కలిపించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ధర్మానకు మొండి చేయి చూపించారు.
అంత అనుభవం ఉన్న ధర్మాన ప్రసాద రావు, ముఖ్య మంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన, ‘చెత్త’ పన్నును చంకనెత్తుకున్నారు. ఇప్పటికే ఈ చెత్త పన్ను విధింపుపై ప్తతిపక్షాలే కాడు, ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం పరుస్తున్నాయి. జుట్టు పన్నలాగా ఈ చెత్త పన్ను ఏమిటని, ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే అవేవీ పట్టకుండా, ధర్మాన ‘చెత్త’ పన్ను ను సమర్ధిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్లుగా చెత్త పన్ను చెల్లించని వారి ఇళ్లముందే ఆ చెత్తను పారేయాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అదీ బహిరంగంగానే. ప్రభుత్వం విధిస్తున్న రూ. 100 చెత్త పన్ను చెల్లించకపోతే ఎలా, అలా చెల్లించనివారి ఇళ్ల దగ్గరే ఆ చెత్తను పారేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు.
శ్రీకాకుళం నగరంలో మంచినీటి పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఈ మేరకు చెత్త పన్ను కట్టని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.100 చెత్త పన్ను విధిస్తే రాద్ధాంతం దేనికని ఆయన ప్రశ్నించారు. అందులో పెద్ద విషయం ఏముందన్నారు. ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని, ఇకపై పన్ను కట్టని వారి వారి చెత్త తీసుకెళ్లబోమని ధర్మాన తేల్చిచెప్పేశారు. చెత్త వారి ఇంటిముందే పోసేయాలని, అప్పుడు అనుభవిస్తే తెలుస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలకు డబ్బులు పంచాలి కానీ చెత్త పన్ను కట్టమని చెబితే ఎలా అంటూ ధర్మాన ప్రశ్నించారు. ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది, అదికారులు, నాయకులు చెత్త పన్ను కట్టించే దిశగా పని చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ధర్మాన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.అంతే కాదు, మంత్రి పదవి కోసం ఇంత కక్కుర్తి పడతారా, అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇంట చెత్త ఆలోచన చేసిందా ..అని నిలదీస్తున్నారు.






