తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Wed Aug 23, 2023 10:06AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(ఆగస్లు22) శ్రీవారిని 72వేల 595 మంది భక్తులు దర్శించుకున్నారు.
27వేల60 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 44లక్షల రూపాయలు వచ్చింది.
ఇక బుధవారం (ఆగస్టు 23) శ్రీవారి దర్శనం కోసం నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు ఎదురు చూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది.


