TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Thu Aug 14, 2025 9:34AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రర్దీ అధికాంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. గురువారం (ఆగస్టు 14) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 28 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుండగా,  300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది.  ఇక బుధవారం (ఆగస్టు 13) శ్రీవారిని మొత్తం 75 వేల 859 మంది దర్శించుకున్నారు. వారిలో  33 వేల 344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చింది.