TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sat Aug 9, 2025 8:45AM

కలియుగ ప్రత్యక్ష  దైవం కొలువై ఉన్నతిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. నిత్యం వేలాది మంది తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం తరలి వస్తుంటారు. అటువంటి తిరుమల క్షేత్రంలో శనివారం (ఆగస్టు 9)  శ్రీనివాసుడి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (ఆగస్టు 8) శ్రీవారిని మొత్తం  70 వేల 480 మంది దర్శించుకున్నారు. వారిలో  28 వేల 923 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  3 కోట్ల 17 లక్షల రూపాయలు వచ్చింది.