TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Fri Aug 1, 2025 9:28AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం (ఆగస్టు 1) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక గురువారం (జులై 31) శ్రీవారిని మొత్తం 66 వేల 149 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24 వేల 429 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి  హుండీ ఆదాయం 4 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది.