తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.5.44 కోట్లు
Published on: Tue Jul 29, 2025 9:06AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (జులై 29) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 77 వేల 44 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 478 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 5 కోట్ల 44 లక్షల రూపాయలు వచ్చింది.


