తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Mon Jul 14, 2025 8:46AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 14) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక ఆదివారం (జులై 13) శ్రీవారిని మొత్తం 80 వేల 193 మంది దర్శించుకున్నారు. వారిలో 33 వేల 298 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 43 లక్షల రూపాయలు వచ్చింది.


