TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

Published on: Fri Jul 11, 2025 10:02AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  శుక్రవారం (జులై 11) దఉదయం తిరుగల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలై శిలాతోరణం వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. గురువారం (జులై 10) శ్రీవారిని మొత్తం 63 వేల 473 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 796 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 54 లక్షల రూపాయలు వచ్చింది.