తిరుమలలో కొనసాగుతున్నభక్తుల రద్దీ
Published on: Mon Jul 7, 2025 9:38AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఎన్జీ షెడ్ల వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 88 వేల938 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 39 లక్షల రూపాయలు వచ్చింది.


