TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భక్త జన సంద్రంగా తిరుమల

Published on: Fri Jul 4, 2025 9:36AM

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం (జులై 4)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ నారాయణ గిరి షెడ్ల వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక  గురువారం (జులై 3) శ్రీవారిని మొత్తం 64 వేల 015 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 786 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇఖ శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 64 లక్షల రూపాయలు వచ్చింది.