TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Tue Jun 24, 2025 9:01AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (జూన్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక మంగళవారం (జూన్ 22) శ్రీవారిని మొత్తం 84 వేల 178 మంది దర్శించుకున్నారు. వారిలో 33 వేల 36 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 72 లక్షల రూపాయలు వచ్చింది.