తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Mon Jun 16, 2025 9:25AM
.webp)
తిరుమలలొ భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జూన్ 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా పడుతోంది.
ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 90 వేల 815 మంది దర్శించుకున్నారు. వారిలో 35 వేల ఏడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చింది.


