TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

Published on: Wed Jun 11, 2025 9:19AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు ముగుస్తుండటంతో తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. బుధవారం (జూన్ 11) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎన్జీ షెడ్డుల వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం  80 వేల894 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 608 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4కోట్ల 30 లక్షల రూపాయలు వచ్చింది.