TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Mon Jun 2, 2025 8:49AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో భక్తులు  తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. సోమవారం  (జూన్ 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యైలైన్ శిలాతోరణం వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 95080 మంది దర్శించుకున్నారు. వారిలో 39 వేల668 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 47 లక్షల రూపాయలు వచ్చింది.