తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Fri May 30, 2025 9:30AM
.webp)
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు చివరి దశకు వస్తుండటం, వారంతం సమీపిస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. శుక్రవారం (మే 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (మే 29) శ్రీవారిని మొత్తం 69 వేల 19 మంది దర్శించుకున్నారు. వారిలో 37 వేల 774 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 42 లక్షల రూపాయలు వచ్చింది.


