TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటలు

Published on: Thu May 22, 2025 9:34AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురువారం (మే 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వెలుపలి వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (మే 21) శ్రీవారిని మొత్తం  80 వేల 964 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 125 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 24 లక్షల రూపాయలు వచ్చింది.