TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Tue May 20, 2025 9:08AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం (మే 20)  ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్  ఏటీజీహెచ్ వరకూ సాగింది.

ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. సోమవారం ( మే 19) శ్రీవారిని మొత్తం 79 వేల మూడు మంది దర్శించుకున్నారు. వారిలో  39 వేల 140 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చింది.