తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Published on: Wed May 14, 2025 8:40AM

తిరుమలలో భక్తుల రద్దీ ఒకింత తక్కువగా ఉంది. బుధవారం (మే 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో తొమ్మిది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం74 వేల 477 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల294 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 98 లక్షల రూపాయలు వచ్చింది.


