తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు
Published on: Thu May 8, 2025 9:39AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గురువారం (మే 8) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఎనిమిది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.
ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 71 వేల మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 637 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 25 లక్షల రూపాయలు వచ్చింది.


