TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Tue Mar 18, 2025 8:47AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (మార్చి 18) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 70 వేల 824 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 764 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 84 లక్షల రూపాయలు వచ్చింది.